Wednesday, 4 November 2026

కామారెడ్డి జేఏసీ ఆగ్రహం

మాస్టర్ ప్లాన్ వెంటనే వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి జేఏసీ ఆగ్రహం !!

రామారెడ్డి జనవరి 6 ( జనం సాక్షి ) :

మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతులను మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి కేంద్రంలో జేఏసీ పిలుపు మేరకు ప్రతిపక్షాలు బంధును కొనసాగి స్తు, ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు జోక్యం కల్పించు కోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని అన్నారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కొందరిని అరెస్టు చేసిన నేపథ్యంలో విలేకరులతో జేఎసి నాయకులు మాట్లాడుతూ , మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములు కోల్పోతున్నారని ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టామని అన్నారు. పోలీసులు తమని మనుషులుగా భావించకుండా విచక్షణ రహితంగా డీసీఎం వ్యానులో మానవత్వం లేకుండా పడేసి వివిధ మార్గాల గుండా రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎనిమిది గ్రామాల కు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తుంటా మని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు మారకుంటే లేని పక్షంలో రైతుల పక్షాన తీవ్రంగా ఆందోళన కార్యక్రమాలు భారీ ఎత్తున చేపడుతామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ రైతులు ఉన్నారు