జహీరాబాద్ నియోజకవర్గంలో
జోనా నరేష్ ఆద్వర్యంలో గ్రామ,గ్రామన వైఎస్ఆర్ టిపి సమీక్షలు
-జోనా నరేష్
జహీరాబాద్ జనవరి 6( జనం సాక్షి)
వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మీల అదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి,గ్రామంలో సమస్యలు,లోపాలను తెలుసుకుంటు గ్రామాల్లో పర్యటిస్తూ దివంగత ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, ఫలాలను వివరిస్తూ,వైఎస్ఆర్ కళలు కన్నా బడుగు బలహీన వర్గాల రాజ్యం వైఎస్ఆర్ టిపితోనే సాధ్యం అవుతుంది అని నియోజకవర్గ ప్రజలతో,యువకులతో మమేకం అవుతూ యువ నాయకత్వం ను పార్టీ లోకి అహ్వానిస్తూ
రానున్న రోజుల్లో జహీరాబాద్ నియోజకవర్గం లో వైఎస్ఆర్ టిపి జెండా ఎగురవేస్తామని,రాష్ట్రంలో వైఎస్ఆర్ టిపి అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు జోనా నరేష్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు దత్తరెడ్డి, నాయకులు జోన నరేష్, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షలు సతీష్ కుమార్, అభిషేక్, పింటూ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.




