Homeజిల్లా వార్తలుహైదరాబాద్వార్తలు కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యత్వ, ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ.. By janamsakshi November 17, 2022, 11:06 2 min read కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యత్వ, ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ… కామారెడ్డి ప్రతినిధి నవంబర్16 జనంసాక్షి; కామారెడ్డిజిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాలులో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యత్వ మరియు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.కోవిడ్ మొదటి, రెండవ దశలో షబ్బీర్ అలీ అద్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలను 40 నిమిషాల నిడివి గల చిత్ర ప్రదర్శన నిర్వహించారు.కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ కార్డుల పంపిణితో పాటు కరోన సమయంలో సేవలందించిన వారికి అవార్డుల ప్రదానం చేశారు.చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి మృతి చెందిన మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గెరిగంటి రాజయ్య కుటుంబానికి 2 లక్షల భీమా చెక్కును కూడా అందజేసారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో 44300 సభ్యత్వం చేయడం గొప్ప విషయం.కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యం అయిందన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఇటీవల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందిన కార్యకర్త రాజయ్య కుటుంబానికి 2 లక్షల బీమా చెక్కు అందజేసాం.కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమను ఎత్తేయడానికి పార్లమెంటులో ప్రధాని మోడీ బిల్లు ప్రవేశపెట్టారు.ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడిన 6 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి.పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా అన్ని పార్టీలతో కలిసి ఆందోళన చేపట్టాం.మోడీ పాలనలో బీడీ కార్మికుల బ్రతుకులు ఆగం అవుతున్నాయి.సిగరెట్, లిక్కర్ ఉన్నప్పుడు బీడీలను మాత్రమే ఎందుకు నిలిపివేయాలి.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 20-25 రోజుల్లోనే బిడీలపై విధించిన జిఎస్టీ ఎత్తేస్తాం.బీడీ కార్మికుల పిల్లల భవిష్యత్తుకు కాంగ్రెస్ భరోసా,కోవిడ్ తొలి, మలిదశలో కాంగ్రెస్ కార్యకర్తల సేవలు అమోఘం.ప్రతి కార్యకర్త సైన్యంలా పనిచేశారు.ప్రాణాలను ఫణంగా పెట్టి వలస కూలీలకు అండగా నిలబడ్డారు.కోవిడ్ సమయంలో సుమారుగా 320 ఆక్సిజన్ సిలిండర్లను షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా సరఫరా చేశాం.కార్యకర్తలు అందరూ గట్టిగా కృషిచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కార్యకర్తలను కోరారు. Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Email a link to a friend (Opens in new window) Email Share on LinkedIn (Opens in new window) LinkedIn Share on Telegram (Opens in new window) Telegram Share on WhatsApp (Opens in new window) WhatsApp Related