Wednesday, 4 November 2026

కామారెడ్డి లొ సర్పంచ్ భర్త దారుణ హత్య

కామారెడ్డి ప్రతినిధి మే23(జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం కు కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ను అతి దారుణంగా హత్య చేశారు. నర్సా గౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కావాలనే నర్సాగౌడ్ ను హత్య చేశారని పేర్కొన్నారు. నర్సా గౌడ్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఉదయం వరకు ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి కుతవేటు దూరంలో నర్సాగౌడ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి కామారెడ్డి డిఎస్పి సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ ప్రసాద్ లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.