జనం సాక్షి ,భువనగిరి (ఆర్.సి )న్యూస్ :భువనగిరి పార్లమెంట్ హెడ్ కోటర్ లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏఐసీసీ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టార్ క్యాంపెనర్ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ జన్మదినం సందర్భంగా 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు,పేద రోగులకు,వయోవృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పాల్గొని పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి మాట్లాడుతూ సమకాలిన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పేద ప్రజలకు పేద కార్యకర్తలకు అన్నా అంటే నేనున్నానని వెంకన్న కు ఎన్ని బాధలు తన గుండెలో పెట్టుకొని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డాక్టర్ గా ఇంజనీర్లుగా పైలట్ గా వివిధ రంగాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తూ పేద ప్రజలు ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రమాదలకు గురైన ఆసుపత్రిలో ఉన్న తన తోచిన విధంగా ఆర్థిక సాయం చేస్తూ స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి మనోధైర్యం కల్పిస్తున్న మనసున్న మారాజు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆమరణ దీక్ష చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవి సైతం త్యాగం చేసి తెలంగాణ రావడం కోసం సోనియా గాంధీని ఒప్పించి మెప్పిచ్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి నేడు పార్లమెంట్ సభ్యునిగా ప్రతిపక్ష నాయకునిగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని వేలాది కోట్లాది రూపాయలు రహదారుల కోసం బీబీనగర్ ఏమ్స్ మెడికల్ కాలేజ్ కోసం వేల కోట్ల రూపాయలను మంజూరు చేయించి పనులు చేయిస్తున్న ఘనత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేష్, ఈరపాక నరసింహ, సలావుద్దీన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజు, జిల్లా సేవాదళ్ చీఫ్ పిట్టల బాలరాజ్, దేవరకొండ నరసింహ చారి, గుర్రాల శీను, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి మధు, గోపె బాబు, గ్యాస్ చిన్న, అర్బన్ కాలనీ గోనూరు వేణుగోపాల్ , అందే నరేష్, కాలియా నాగరాజు, విజయ్, షానూర్, మహేందర్, ప్రభాకర్, సాయి, నర్సింగరావు, రాము తదితరులు పాల్గొనడం జరిగింది.





