Wednesday, 4 November 2026

కామ్రేడ్ పులిచింతల వెంకట్ రెడ్డి అకాల మరణం

హుజూర్ నగర్ మే 26(జనం సాక్షి):
పట్టణానికి చెందిన సిపిఎం పార్టీ నాయకుడు కామ్రేడ్ పులిచింతల వెంకట్ రెడ్డి శుక్రవారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. వెంకటరెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా మూడుసార్లు సుమారుగా 10 సంవత్సరాలు తాను బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా రెండుసార్లు పనిచేశాడు. వార్డు మెంబర్ గా గెలిచి తన ఇంటిపేరునే నెంబర్ వెంకట రెడ్డిగా మార్చుకుని పార్టీలో రాజకీయంగా నిస్వార్ధంగా పనిచేశాడు. తన భార్యను లక్ష్మి ఎంపీటీసీగా గెలిపించుకున్నాడు. ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలుచున్న అరబెల్లి లక్ష్మీనారాయణ, జూలకంటి రంగారెడ్డిని గెలిపించడానికి క్రియా శీలక పాత్ర పోషించాడు. చివరి వరకు వెంకటరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు తన వంతు కృషి చేశాడు.