Wednesday, 4 November 2026

జిల్లా ప్రజల రక్షణే మా ప్రథమ కర్తవ్యం. జిల్లా ప్రజల రక్షణే మా ప్రథమ కర్తవ్యం. హెల్మెట్ రైడ్ లో పాల్గొన్న వారికి హెల్మెట్ అందజేత

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి,  మే 26 :-
హెల్మెట్ రైడ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి దొడ్డి కొమరయ్య విగ్రహం వరకు సుమారు 200 మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అధితి జిల్లా ఎస్పీ శ్రీ. యం. రమణ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభిచారు.
ఈ సందర్భంగా హోప్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ కృష్ణమూర్తి స్పాన్సర్ చేసిన హెల్మెట్ లను బైక్ ర్యాలీలో పాల్గొన్న వారికి బాహుకరించారు. అనంతరం దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఎస్పీ గారు జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ మరియు హోప్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన హెల్మెట్ రైడ్ కార్యక్రమంలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజుల్లో అత్యాధినిక సాంకేతికతతో అధిక స్పీడ్ తో వెళ్ళగల బైక్ లు మార్కెట్ లలో అందుబాటు ఉన్నాయని, యువత ఎక్కువ అధిక స్పీడ్తో వెళ్ళే వాహనాల వైపు మొగ్గు చూపుతూన్నారు. అధిక స్పీడ్ తో వెళుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక రకాల రోడ్డు ప్రమాదాలకు గురౌతు శాశ్వత అంగవైకల్యం లేదా ప్రాణాలు కొల్పవడం జరుగురుంది. వేగం కన్నా ప్రాణాలే గొప్ప అని తెలుసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించడం వలన క్రాఫ్ చెడిపోతుందనో లేదా బట్టతల వస్తుందనో హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందన్నారు. తల బాగుంటేనే జుట్టయినా, శరీర అందమైన కావున అలాంటి తలను రక్షించుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేశారు. బైక్ డ్రైవ్ చేసే వారీతో సహ బైక్ పైన వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు. హెల్మెట్ ధరించడం వలన 49% ప్రాణ నష్టాన్ని, 69% అంగవైకల్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు యాక్సిడెంట్స్ లలో 70% మంది  హెల్మెట్ ధరించలేక పోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ముందు మనం పాటించిన తరువాతే ఇతరులకు చెప్పాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.  ఈ సందర్భంగా హోప్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ మూర్తిని  ఉద్దేశించి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తరువాత చికిత్స చేయడం కంటే, ప్రమాదాన్ని ముందే అరికట్టాలన్న ఉద్దేశ్యంతో వారు ఉచితంగా హెల్మెట్ అందించారని, హెల్మెట్ ధరించలేకపోవడం వలన జరిగే రోడ్డు ప్రమాదాలగురించి అవగాహన కల్పించాలన్న వారి సంకల్పం గొప్పదన్నారు. ఈ సందర్భంగా హోప్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమాంలో అదనపు ఎస్పీ శ్రీమతి టి. ఉషావిశ్వనాధ్ గారు, సంగారెడ్డి డి.ఎస్.పి బి.రవీంద్రారెడ్డి, సి.ఐలు శివలింగం, శ్రీధర్ రెడ్డి, ట్రాఫిక్ సి.ఐ. బి.రాజు, హోప్ హాస్పిటల్ సిబ్బంది మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.