బెల్లంపల్లి, ఏప్రిల్ 19, (జనంసాక్షి )కామ్రేడ్ భూపతి రెడ్డి అలియాస్ రఘు ఆశయాలను కొనసాగిస్తామని సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్ అన్నారు. బుధవారం ఆయన భూపతి రెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా అంబాల మహేందర్ మాట్లాడుతూ 19-4-2014న అమరులైనారని వారికి విప్లవ జోహార్లు అన్నారు. కామ్రేడ్ భూపతి రెడ్డి అలియాస్ కృష్ణమోహన్ రఘు యూసిసిఆర్ఐఎంఎల్ (భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేంద్రం. మాలే) పార్టీతో సంబంధాలు కలిగి ఉంటూ సింగరేణి కార్మికుల పక్షాన, గ్రామీణ పేదల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాలకు తన వంతు పాత్ర నిర్వహిస్తూనే కమ్యూనిస్టు జీవితాన్ని కొనసాగించారన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల ప్రధాన సమస్య అయినటువంటి 4వ వేజ్ బోర్డు 5వ వేజ్ బోర్డు సందర్భంలో కార్మికులు చేసినటువంటి సుదీర్ఘ సమ్మె పోరాటానికి నాయకత్వం వహిస్తూ తన వంతు పాత్ర పోషించాడన్నారు. ఆయన పోరాట పటిమ వల్లనే వేజ్ బోర్డు సమస్యలు పరిష్కారం అయ్యయన్నారు. సింగరేణి ప్రాంతానికే కాకుండా కోల్ ఇండియా కార్మికుల జీతభత్యాల సమస్య పరిష్కారమైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జన్నారం ప్రాంతంలో భూమిలేని పేదలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేసుకున్నటువంటి పోడు వ్యవసాయానికి బాసటగా నిలిచి సుమారుగా ఒక 10 ,12 గ్రామాల ప్రజలు దాదాపు 3, 4 వేల ఎకరాలు భూమిని చదును చేసి సాగు చేసే కార్యక్రమంలో గ్రామీణ పేదల పక్షాన బాసటగా నిలిచారన్నారు. ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన కామ్రేడ్ మాడిశెట్టి భూమయ్య ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వారు కూడా ఈ పోరాటానికి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా పోలీసుల మరియు ఫారెస్ట్ వారి నిర్బంధాలను ఖండిస్తూ గ్రామీణ పేదలకు అండగా నిలిచారన్నారు. వీరికి గ్రామీణ పేదల సంఘం తరఫున విప్లవ ధన్యవాదాలు, సింగరేణి గని కార్మిక సంఘం తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో
గ్రామీణ పేదల సంఘం
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్నం శంకర్, తదితరులు పాల్గొన్నారు.




