Wednesday, 4 November 2026

జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా  చిలుకమారి శ్రీనివాస్

 

 

 

 

జనంసాక్షి (హుజురాబాద్):జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన చిలుకమారి శ్రీనివాస్ ను నియమిస్తు జాతీయబీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య  ఉత్తర్యులు జారీ చేసారు.ఈ సందర్భంగా ఆర్ క్రిష్ణయ్య  మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారం కోసం, అణగారిన వర్గాల  అభ్యున్నతి కోసం, బీసీ లకు రాజ్యాధికారం రావాలని సూచించారు.  బీసీ కులాలు నేటి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఆ దిశగాఅట్టడుగు వర్గాల  జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కుల సంజయ్ కుమార్, బీసీ నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు.