Wednesday, 4 November 2026

కామ్రేడ్ వెంకటరెడ్డి కి జోహార్లు అర్పించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 27 (జనంసాక్షి): పట్టణంలో స్వర్గస్తులైన సిపిఎం నాయకులు, మాజీ వార్డ్ మెంబర్ కామ్రేడ్ పులిచింతల వెంకటరెడ్డి భౌతిక కాయానికి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పూలమాలలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, అట్లూరి హరిబాబు, కిరణ్, శరత్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.