Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

 

 

 

 

 

 

 

బిచ్కుంద మే 27 (జనంసాక్షి) రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మండల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రానికి చెందిన 28 సంవత్సరాల హాజి ప్రకాష్ అనే వ్యక్తి శనివారం నాడు ఉదయం తన బైక్ పై బిచ్కుంద నుండి మద్నూర్ వెళ్ళే మార్గంలో కందర్ పల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే పైన మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం ప్రకాష్ బైకును ఢీకొట్టగా అక్కడికక్కడే చనిపోయినాడు. అతని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.