కారు బాంబు దాడిలో 10మంది మృతి

డమస్కస్‌: సిరియా రాజధాని డమస్కస్‌లో ఆదివారం కారు బాంబు పేలి 10మంది దుర్మరణం చెందారు. 12మందికి గాయాలయ్యయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌తో సహ ఐక్యరాజ్య సమితి  శాంతిదూత భేటీ అయేందుకు డమస్కన్‌ వచ్చిన రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం బాబ్‌ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఈ కారు బాంబు పేలిందని ఉన్నతాధికారులు తెలిపారు.