Wednesday, 4 November 2026

కార్పొరేటర్ సిద్ధం రాజుకు సన్మానం

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 08 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజును కొమురవెల్లి మున్నూరు కాపు సత్రం భవన ట్రస్ట్ చైర్మన్ ఉప్పు రవీందర్ పటేల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన కొమురవెల్లిలో మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం భవన నిర్మాణం కోసం భూమి పూజ ఉందని ఈ కార్యక్రమానికి రావాలని కార్పొరేటర్ సిద్ధం రాజు ని ఆహ్వానించారు. అదేవిధంగా సత్రం నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ఉప్పు రవీందర్ పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో గూడెపు ప్రవీణ్ పటేల్, మొగిలి దుర్గాప్రసాద్ పటేల్, మాడిశెట్టి మురళి పటేల్ తదితరులు పాల్గొన్నారు.