రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 9.,(జనంసాక్షి). పెండింగ్ బిల్లులు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల సర్పంచుల పురం నాయకులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నిర్వహణ కోసం సర్పంచులు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రావలసిన పెండింగ్ బకాయిలను నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.




