Tuesday, 3 November 2026

కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం చర్చల విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమ్మెనోటీసు ఇచ్చిన ఆర్టీసీ గుర్తింపు సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం జరిపి చర్చలు విఫలమయ్యాయి. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌, వేతన సవరణపై యాజమాన్యం నుంచి హామీ రాలేదని గుర్తింపు సంఘాలు ఎంప్లాయిస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా జూలై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *