Monday, 2 November 2026

కార్మికుల హక్కులను కాలరాస్తున్న పాలకులు: సిపిఐ.

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.మే1 కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండల కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల సహాయ కార్యదర్శి కాసర్ల నాగరాజు పేర్కొన్నారు.ప్రపంచ కార్మిక దినోత్సవం 137వ మేడే సందర్భంగా మల్కాజిగిరి లోని హిల్ టాప్ కాలనీ లో సిఐటియు జండా ఎగురవేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ తలుపులు తెరవబడ్డాయని ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి  సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు గోడలుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారని మండి పడ్డారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి మండల కార్యదర్శి యాదగిరి,సిపిఐ నాయకులు జెన్ను రాములు,అజీజ్,ప్రభాకర్,రాములు, సాయిగౌడ్,దేవేందర్,లింగం,దేవయ్య పాల్గొన్నారు.