Monday, 2 November 2026

ప్రతినిధి మెదక్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి

 

 

 

 

 

 

జనం సాక్షి  పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి 13 వినతులు స్వీకరించారు. ఇందులో ధరణికి సంబంధించి 6 వినతులు రాగా, డబుల్ బెడ్ రూమ్ ఇంటికి ఒకటి, ఆసరా పింఛనలకు సంబంధించి 3, ఇతర శాఖలకు సంబంధించి 3 వినతులు వచ్చాయి.
అనంతరం ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయిన పంట వివరాలపై సమీక్షిస్తూ ఏ రైతు నష్టపోకుండా గ్రామ వారీగా రైతువారీగా ఖచ్చితమైన పంట నష్టం వివరాలు సేకరించవలసినదిగా వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రధానంగా 9 మండలాలలోని 20,089 రైతులకు చెందిన 25,166 ఎకరాలలో వరి , పండ్ల తోటలకు నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చామని అన్నారు. ఇందులో వరి పంటకు సంబంధించి 19,517 రైతులకు చెందిన 23,580 ఎకరాలు, పండ్ల తోటలకు సంబంధించి 572 మంది రైతులకు సంబంధించి 1,586 ఎకరాలలో పంట నష్టం జరిగిందని అన్నారు. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యాన అధికారులు, మండల ప్రత్యేకాధికారులు గ్రామ వారీగా, రైతు వారీగా పంట సర్వే నిర్వహించి వరి ధాన్యం తో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్న వివరాలను పక్కాగా సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని, నమోదు చేయుటకు ధరణి ఆపరేటర్ల సేవలు ఉపయోగించాలని సూచించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఇట్టి సమాచారాన్ని బుధవారం లోగా 14 కాలమ్స్ ప్రొఫార్మాలో సేకరించి సమర్పించాలని ఆదేశించారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరించాలన్నారు. పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సిడీ క్రింద ఎకరాకు 10 వేల రూపాయలు అందించుటకు ఉత్తర్వులు జారీచేసిందని అన్నారు. ఈ నష్ట పరిహారం కాస్తు చేస్తున్న కౌలుదారులకు కూడా వర్తిస్తుందని, కాబట్టి నివేదిక పక్కాగా ఉండాలని అన్నారు. ఈ యాసంగిలో ఇటీవల పంట నష్టపరిహారం పొందిన లబ్ధిదారునికి తిరిగి చెల్లించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చిన పంట సమగ్ర సర్వే నివేదికలను బుధవారం సమావేశమై పరిశీలించి ప్రభుత్వానికి పంపుతామని, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమచేస్తున్నదని అన్నారు.
ఈ సమావేశంలో అధికారులు, జయరాజ్, ఖాసీం, రజాక్, కృష్ణమూర్తి, రాధాకిషన్, జెంలా నాయక్, విజయలక్ష్మి, కరుణ, బ్రహ్మాజీ, సాయిబాబా, నారాజ్, శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్ నారాయణ్, ఆర్.డి.ఓ సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.