హైదరాబాద్: కనీస వేతనాలు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా గత 8రోజులుగా తపాలశాఖ, టెలిగ్రాఫ్ తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు పలికింది. కార్మిక చట్టాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ విమర్శించింది. పోస్టల్, టెలిగ్రాఫ్ తాత్కాలిక ఉద్యోగులకు పండుగ బోనస్ వెయ్యి రూపాయాలు తగ్గించటం వల్ల దేశ వ్యాప్తంగా పని చేస్తున్న దాదాపు 3లక్షల మంది ఉద్యోగులు నష్ట పోతున్నారని సీపీఐ పేర్కొంది.




