Wednesday, 4 November 2026

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ల రద్దుకై పోరాడుదాం

 

 

 

 

 

 

రఘునాథ పాలెం మే 05(జనం సాక్షి)భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మే 1 నుంచి మే 7 వరకు మేడే జెండాల ఆవిష్కరణ సందర్భంగా మండలంలోని గణేశ్వరం గ్రామంలో ఇఫ్ట్ అరుణ పతాకాన్ని భావన నిర్మాణ సంఘం జిల్లా నాయకులు గుగులోతు పటేల్ ఆవిష్కరించారు. అనంతరం ఇఫ్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ సుబాహన్ మాట్లాడుతూ 1886 మే 1 కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పని గంటల తగ్గింపు కోసం అమెరికా దేశంలోని చికాకో నగరంలో కార్మికులు చేసిన పోరాటం ఏదైతే ఉందో వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు దేశంలో మతోన్మధ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్నటువంటి నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన నోరు మెదపని బూర్జువా పార్టీలు మేడే జెండాలను హంగు ఆర్భాటాలతో ఎగరవేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇకనైనా కార్మికుల పక్షాన పోరాటాలకు కలిసి రావాలని ఆయన అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్ని కార్మిక రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే పరిష్కారం చేయాలని వారు అన్నారు లేనిపక్షంలో దశల వారి పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ నాయకులు పాముల మోహన్ రావు మాట్లాడుతూ అచ్చేదిన్ తీసుకొస్తా అని చెప్పిన మతోన్మాద మోడీ ప్రభుత్వం కార్మికుల పాలిట సచ్చేదినుగా మార్చి లాక్ డౌన్ కాలంలో కార్మికులు హరిగోసపడుతూ కాలినడకన వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత నరేంద్ర మోడీది దేశ సంపదను మొత్తాన్ని కూడా బడా కార్పొరేట్ వ్యవస్థలకు ఈ మోడీ వారి ఫ్రెండ్స్ అనిల్ అంబానీ అనిల్ ఆదాని ఆస్తులను పెంచుటకు నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నాడు ఈ విధానాలను కార్మిక వర్గం సరైన సమాధానం చెప్పటకు సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పరకాల లక్ష్మి ఇఫ్ట్ నాయకులు సందీప్,కే హనుమంతరావు, బాబు, జే రెడ్డి, ఉమా, న్యూడెమోక్రసీ నాయకులు.ప్రసాదు, పరమయ్య తదితరులు పాల్గొన్నారు.