Wednesday, 4 November 2026

వికలాంగులకు బస్ పాస్ ల పంపిణీ.

 

 

 

 

 

 

నెన్నెల, మే 5, (జనంసాక్షి )మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ ఇందూరి శశికళ గ్రామంలోని 14 మంది వికలాంగులకు రాయితీ బస్ పాస్ లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని, వికలాంగులు అట్టి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వికలాంగులకు బస్ పాస్ లు మంజూరు చేసిన ఆర్టీసీ అధికారులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, వికలాంగులు పాల్గొన్నారు.