హైదరాబాద్ : రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో నిన్న కార్మికసంఘాలు, ఆర్టీసీ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో నేడు మరోసారి చర్చలు జరపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు బస్ భవన్‌కు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.




