Wednesday, 4 November 2026

కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు హామీ లభించకపోవడంతో.. చర్చల నుంచి ఈయూ, టీఎంయూ నేతలు బయటకు వచ్చేశారు. యాజమాన్యంతో చర్చలు అసంతృప్తిగా ముగిశాయని కార్మిక సంఘం నేతలు తెలిపారు. డిమాండ్ల పరిష్కారానికి మరికొంత గడువు ఇవ్వాలని… మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చేవరకు వేచిచూడాలని యాజమాన్యం కోరింది. ఇవాళ అర్ధరాత్రి వరకు వేచి చూస్తామని ఈయూ, టీఎంయూ నేతలు ప్రకటించారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డితో ఆర్టీసీ అధికారులు భేటీ అయ్యారు. కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నామని.. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *