వరంగల్ ఈస్ట్, జూన్ 15 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్ లెనిన్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ కార్యకర్త రొయ్యల సాయి ప్రసాద్ ప్రమాదవశాత్తు మరణించగా గురువారం వారి కుటుంబానికి అండగా రెండు లక్షల రూపాయల గులాబీ పార్టీ ఇన్సూరెన్స్ చెక్ ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సాయి ప్రసాద్ తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఉంటుందని కేసీఆర్,కేటీఆర్ నాయకత్వనా ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.గులాబీ జెండా మోసే ఏ కార్యకర్త పార్టీ వదుకోదని అట్లాంటి నిఖార్సుగా పని చేసే కార్యకర్తలు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 2లక్షల రూపాయలు అందించి ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు…ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్,మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ,కొంతం మోహన్, ఖిలా వరంగల్ పిఏసిఎస్ చేర్మెన్ కేడల జనార్దన్, తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఎంఏ జబ్బార్, డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్,ఇతర డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ డివిజన్ల అధ్యక్షులు,ముఖ్య నాయకులు హాజరయ్యారు
కార్యకర్తకు అండగా బిఆర్ఎస్ పార్టీ




