బిచ్కుంద జూన్ 14 (జనంసాక్షి)ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం రోగులకు అపదలో ఆపన్నహస్తంలా ఆదుకుంటుందని ఎంపీ బీబీ పాటిల్ గారు అన్నారు. గత ప్రభుత్వాలలో ఈ పథకం పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉండేదని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద మనసుతో ప్రతి పేద వాడికి అందిస్తున్నారని అన్నారు. బుధవారం నాడు కామారెడ్డి జిల్లా కోటగిరి మండలంలోని హెగ్ధోలి గ్రామానికి చెందిన ఆరుగొండ ఉమాకాంత్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన రూ.5,00,000/- చెక్కును లబ్ది దారుడికి అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రోగులకు అపదలో ఆపన్నహస్తంలా సీఎంఆర్ఎఫ్ పథకం ఎంపి బీబీ పాటిల్




