హైదరాబాద్ : నగరంలోని ఓ ఏరియాలో సిలిండర్ పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన నాంపల్లిలోని బజార్ఘాట్ లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు… నాంపల్లి బజార్ఘాట్లో ఓ కార్ల షెడ్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీగా శబ్ధం రావడంతో స్థానికులు భయందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో సిబ్బంది ఉన్నారు. ప్రమాద కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.




