Friday, 6 November 2026

నెలాఖరులోగా పదివేల కోట్ల సాయం: సుజనా చౌదరి

ఢిల్లీ, మార్చి 15: ఈ నెలాఖరులోగా ఏపీకి, కేంద్రం రూ.10 వేల కోట్ల సాయం అందిస్తుందని  కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి నిట్‌, ఐఐటీ, ఎయిమ్స్‌ సహా అన్ని కేంద్రీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఏపీలోని వెనుకబడిన 7 జిల్లాలకు ఐదేళ్ల పాటు రూ.700 కోట్ల సాయం కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సుజనా చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి సంవత్సరం 2 వేల కోట్లు కేటాయింపు జరుగుతుందని,  ఇప్పటికే రూ.1000 కోట్లు మంజూరయ్యాయని  ఆయన పేర్కొన్నారు.  రూ.350 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలంటే.. కేంద్ర కేబినెట్‌ క్లియరెన్స్‌ ఉండాలని, ఒకట్రెండు రోజుల్లో ఏపీకి నిధులు వస్తాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లు మాత్రమే వస్తాయని, ఒక వేళ ప్రత్యేక హోదా రాకపోతే అంతకుమించి నిధులు తీసుకోస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *