Wednesday, 4 November 2026

కాలనీలలోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యోవిధంగా కృషి చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

వికారాబాద్ రూరల్ జూలై 7 జనం సాక్షి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో పేర్కొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరికరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే * డాక్టర్ మెతుకు ఆనంద్”* పేర్కొన్నారు శుక్రవారం”మీతో నేను”కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని 24,25,33,34 వార్డులలో పర్యటించారు.పాడైపోయిన మ్యాన్ హోల్స్ బాగు చేసి, అండర్ డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలన్నారు.కాలనీలలో ఓపెన్ ప్లాట్స్ లలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ఉండాలన్నారు.వార్డులలో పాత స్థంబాలు తొలగించి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. 24వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలని, పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నారు.శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ… కాలనీలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలలో రోడ్లు మరియు తదితర అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు ముత్యం రెడ్డి పుష్పలత రెడ్డి గోపాల్ ముదిరాజ్ మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డి వివిధ గ్రామాల పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.