
బిచ్కుంద జులై 07 (జనంసాక్షి) బిచ్కుంద మండలకేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో శుక్రవారం నాడు ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీవో ఆనంద్, డివిజన్ ఆరోగ్య భొధకులు దస్తీరామ్ మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండ తగు నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కీటకాల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులపైన అవగాహన కల్పించటం జరిగినది. ఈ కార్యక్రమములో ఎంపీవో మహబూబ్, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఆశలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




