మారనున్న తెలంగాణ బీడు భూమల చరిత్ర
కెసిఆర్, హరీస్ రావుల కృషి అమోఘం
హైదరాబాద్,జూన్7(జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావం తరవాత అద్భుత నిర్మాణంగా,అద్భుత ప్రణాళికతో అందరి ప్రశంసలందుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్ని అవరోధాలనూ అధిగమించింది. గోదారమ్మ ప్రణమిల్లి కాళేశ్రుడి సాక్షిగా తెలంగాణ బీడుభూములను పలకరించనుంది. ఇందుకు ఇద్దరంటే ఇద్దరే కారకులని చెప్పుకోవాలి. ఈ పథకాన్ని రీ డిజైన్ చేయించి నిరంతరం పర్యవేక్షిస్తూ దీనిని ఉడుం పట్టులా పట్టి ముందుకు తీసుకుని వెల్లడంలో సిఎం కెసిఆర్ కృషి అమోఘం. దానిని మాట్లో చెప్పలేం. ఆయన ఎంతగా దీనిపై శ్రద్ద పెట్టారన్న దానికి అనుమతులు మొదలు ప్రాజెక్టు పూర్తి వరకు జరుగుతన్న పనులే నిదర్శనం. ఇకపోతే మరొకరు మంత్రి హరీష్ రావు. ఆయన నిరంతరం సవిూక్షలు చేస్తూ కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిరతంరం శ్రమించడం వల్ల ఇవాళ కాళేశ్వరం కల సాకార మయ్యింది. వీరిద్దరూ తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించారనే చెప్పాలి. నాయకులన్నవారు నిరంతరం ప్రజల సంక్షేమం కాంక్షించి పనిచేస్తే కానిదేవిూ ఉండదని కాళేశ్వరం ద్వారా కళ్లముందు సాక్షాత్కరింప చేశారు. అంవదుకే ఈ ప్రాజెక్ట్ నియమ నిబంధనలన్నింటిని అనుసరిస్తూ.. తుది అనుమతిని సైతం సాధించింది. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి (టీఏసీ) బుధవారం ఇచ్చిన అనుమతితో ఇక కాళేశ్వరానికి ఇక తిరుగులేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం తొమ్మిది కీలక అనుమతులు సాధించింది. తాజాగా ఇప్పుడు సాంకేతిక సలహా మండలి అనుమతులు లభించాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అన్ని అనుమతులు ఇచ్చినట్లయింది. ఢిల్లీలోని కేంద్ర జల సంఘంకార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో సాంకేతిక సలహా మండలి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కాళేశ్వరం కల నెరవేర బోతున్నది. తెలంగాణ జలసమస్యను తీర్చే అద్భుత ప్రాజెక్టుగా నిలవనుంది. సుమారు మూడేండ్ల కిందట పురుడుపోసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇప్పుడు వడివడిగా పూర్తి కాబోతున్నది. దీనికి రావాల్సిన అన్ని అనుమతులు రావడంతో పనుల్లో మరింత వేగం పెరగనుంది. కేవలం సంవత్సరకాలం లోనే అన్నిరకాల అనుమతులు సాధించిన ప్రాజెక్టుగా దేశంలోనే రికార్డు సృష్టించింది. గత కాంగ్రెస్ పదేండ్ల కాలంలో ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి కేంద్ర జలసంఘం నుంచి ఒక్కటంటే ఒక్క అనుమతి రాలేదు. దశాబ్దాల ప్రస్థానం ఉన్న పోలవరం ప్రాజెక్టుకు కూడా నేటికీ అన్ని రకాల అనుమతులు రాలేదు. కానీ.. కాళేశ్వరం మాత్రం రికార్డుస్థాయిలో అన్ని అనుమతులు సాధించి.. తెలంగాణ జలసిరులు కురిపించేందుకు సిద్ధమవుతున్నది. ఈ వర్షాకాలంలోనే గోదారమ్మ పరవళ్లతో బీడు భూములను పలకరించనుంది. అతి తక్కువ సమయంలో కేంద్ర జల సంఘం నుంచి ఇప్పటివరకు అన్ని రకాల అనుమతులు సాధించిన ప్రాజెక్టుగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రికార్డు సృష్టించింది. చివరగా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పెట్టుబడికి సంబంధించి లాంఛన అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయం వివరాలపై కేంద్ర జలసంఘంలోని అంచనా వ్యయ (ఇరిగేషన్)-2 డైరెక్టరేట్ ఈ ఏడాది మే నెలలోనే సంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టులో రూపాయి వెచ్చిస్తే రూపాయిన్నర ప్రయోజనముంటుందని స్పష్టంచేశారు. దీంతో సీడబ్ల్యూసీ నుంచి సంతృప్తి వ్యక్తమైన దరిమిలా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పెట్టుబడి అనుమతి సులువుగా వస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన భగీరథయత్నంలో భాగంగా 2015 సెప్టెంబర్ నెలలో దేశంలోనే అరుదైన లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత నెలల తరబడి మేధోమథనంతో మేడిగడ్డ వద్ద ప్రధాన బరాజ్‌తో మూడు వరుస బరాజ్‌ల డిజైన్‌తో ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. అదే ఏడాది మే రెండో తేదీన సీఎం కేసీఆర్ మహదేవ్పూర్ పరిధిలోని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నీటిపారుదలశాఖ వెనువెంటనే సాంకేతిక అంశాలన్నీ పూర్తిచేసుకొని, టెండర్లు.. ఆపై పనులకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చేసిన కృషి ఫలితంగా 2016 ఆగస్టు 23న మహారాష్ట్ర – తెలంగాణ మధ్య చారిత్రాత్మక సాగునీటి ఒప్పందాలు జరుగడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పట్టాలెక్కింది. అనంతరం ఒకవైపు శరవేగంగా పనులు సాగించడం, మరోవైపు అన్నిరకాల అనుమతులను సాధించడమనే బృహత్తర బాధ్యతలను చేపట్టిన ప్రభుత్వం అందులో సఫలీకృతమవుతున్నది. ఈ ఏడాది మార్చినాటికే దాదాపు 48 శాతానికిపైగా పనులు పూర్తిచేయడం.. అందులోనూ నిర్మాణరంగపరంగా రికార్డులను సృష్టించడం ఎప్పుడూ చూడని అనుభవాలు. ఒకవైపు పనులు కొనసాగుతుండగా మరోవైపు సత్వరం అనుమతులను సాధించడాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ప్రధానంగా నీటిపారుదలశాఖ ఇంజినీర్లు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అహర్నిశలు కృషిచేయడంతో గత ఏడాది మార్చి నుంచి ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతుల పరంపర మొదలయింది.




