Tuesday, 3 November 2026

కాళేశ్వరంపై అధికారులతో హరీష్‌ సవిూక్ష

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): నీటిపారుదలశాఖ, బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పంపులపై అధికారులతో మంత్రి సవిూక్షించారు. టెండర్‌ పక్రియలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంపు హౌస్‌ల ఏర్పాటు ప్రాంతాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు గురించి బీహెచ్‌ఈఎల్‌ అధికారులకు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు చేప్టటేలా చూడాలని అధికారులకు సూచించారు. అధికారులు పనులను సకాలంఓ పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎక్కడా అలసత్వం లేకుండా చూడాలన్నారు. ఇదిలావుంటే  వ్యవసాయం-సాగునీటిపారుదల-నీటి నిర్వహణ రంగాల్లో ఇజ్రాయెల్‌ అనుభవాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల బృందం ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నది. ఈ బృందంలో మూడు రాష్టాల్ర సాగునీటిపారుదల శాఖ మంత్రులు, కేంద్ర సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఎంపీ కల్వకుంట్ల కవితకు చోటు దక్కింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల సాగునీటి మంత్రులు హరీశ్‌ రావు, బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, గిరీశ్‌ దత్తాత్రేయ మహాజన్‌, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్‌, కమిషనర్‌ కుష్వీందర్‌ వోరా, ఉమాభారతి ఓఎస్డీలు లోకేష్‌కుమార్‌, నందితా పాఠక్‌లు ఈ బృందంలో ఉంటారు. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెల్‌ అవీవ్‌, ఎష్కోల్‌, టిష్లోవెట్‌కిషోన్‌ తదితర ప్రాంతాల్లోని వివిధ నీటి ప్లాంట్లను సందర్శిస్తారు.

దశాబ్దం క్రితం తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ పరిస్థితిని అధిగమించడం కోసం ఆ దేశం అనుసరించిన అధునాతన విధానాలు, వాటి ఫలితాలు, ఆ అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై ఈ బృందం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఆ దేశ జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులతో పాటు ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో కూడా ఈ బృందం భేటీ అవుతుంది. నీటి నిర్వహణలో అనుసరిస్తున్న మేలైన విధానాలను అధ్యయనం చేసి వాటిని మన దేశ అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. పర్యటనలో భాగంగా భారత్‌ బృందం ఈ నెల 28వ తేదీన ఉదయం ఇజ్రాయెల్‌ నీటి వనరులు-ఇంధన-మౌలిక సౌకర్యాలపై ఆ దేశ మంత్రి యువాల్‌ స్టీనిట్జ్‌తో భేటీ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *