హైదరాబాద్,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుతో టీఆఱ్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భేటీ ముగిసింది. భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సిరసిల్లలో కామన్ సెంటర్ టెక్స్‌టైల్ జోన్ లేదా మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరితో కోరామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల తర్వాత సిరిసిల్ల రావాలని కోరామని చెప్పారు. త్వరలోనే తేదీలను నిర్ణరుంచుకుని చెప్తామని కావూరి చెప్పారని కేటీఆర్ తెలిపారు.




