Saturday, 7 November 2026

కావేరికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష 10 వేలు ఆర్థిక సాయం

కావేరికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష 10 వేలు ఆర్థిక సాయం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పిల్లలమర్రి కావేరి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.ఈ ప్రమాదంలో తండ్రి పిల్లలమర్రి సత్యనారాయణ,తమ్ముడు జస్వంత్ ఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కావేరి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కై. లయన్స్ క్లబ్ సహకారంతో రూ.లక్ష10 వేల రూపాయల కావేరి తల్లి కళ్యాణి కి నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్బంగా కావేరీ తల్లి కల్యాణి మాట్లాడుతు ఆర్ధిక సహాయం చేసిన లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యడవల్లి సత్య నారాయణ రెడ్డి,కార్యదర్శి చల్లా ప్రభాకర్ రెడ్డి,మాజీ అధ్యక్షులు పోరెడ్డి శ్రీరాంరెడ్డి, సుంకరి క్రాంతి కుమార్,బట్టు మధు,కంది బండ శ్రీనివాస రావు,కోశాధికారి జీలకర రామస్వామి,సభ్యులు కర్రీ సూర్య నారాయణ రెడ్డి,ఉప్పల లక్ష్మరెడ్డి, బత్తినీ రాజేష్,తదితరులు పాల్గొన్నారు