Saturday, 7 November 2026

తెరాస నాయకుల కబ్జా లో సివిల్ సప్లై గోదాం లు ప్రభుత్వ ఆస్తులపై కూడా కన్ను

తెరాస నాయకుల కబ్జా లో సివిల్ సప్లై గోదాం లు
ప్రభుత్వ ఆస్తులపై కూడా కన్ను
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల
మిర్యాలగూడ, జనం సాక్షి.

ప్రభుత్వ ఆస్తులు, జాగాలను కూడా తెరాస నేతలు వదలడం లేదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం
స్థానిక కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి ఆధ్వర్యంలో బాపూజీ నగర్ ఏడో వార్డులో ఉన్న సివిల్ సప్లై,ప్రభుత్వ భూములను పరిశీలించిన అనంతరం వార్డులో ప్రభుత్వ గోదాములు అన్యాక్రాంతమవుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే సివిల్ సప్లై భూములను కూడా టిఆర్ఎస్ నాయకులు వదిలిపెట్టడం లేదని ఏడవ వార్డులో సివిల్ సప్లై గోడౌన్ మరియు ఆనుకొని ఉన్నటువంటి జాగాలను తప్పుడు కాగితాలు సృష్టించి ప్రజల సొమ్ములను టిఆర్ఎస్ నాయకులు కాజేయాలని చూస్తున్నారని దీనికి ప్రభుత్వ అధికారులే వత్తాసు పలుకుతుంటే సామాన్యులు ఏం చేయగలుగుతారని ఈ టీఆర్ఎస్ నాయకుల దురాగతాలను భూ కబ్జా వ్యవహారాలను ఇంకా వెలుగు లోనికి తీసుకొస్తామని అని వారన్నారు ఈ అక్రమణలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, నాయకులకు అధికారులు అండగా ఉండి ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి అధికారులకు త్వరలోనే చరమగీతం పాడుతామని అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో ఖాళీగా ఉన్న ఏ స్థలాన్ని టిఆర్ఎస్ నాయకులు వదిలిపెట్టకుండా ఆక్యుపై చేస్తున్నారని అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో ఫ్లాట్లు వచ్చినవాళ్లు అందుబాటులో లేకుంటే వెంటనే ఆ ఫ్లాట్లపై తప్పుడు కాగితాలను పుట్టించి వాటిని అమ్మకానికి పెడుతున్నారని ఇవన్నీ కూడా అధికారుల సహకారంతోనే జరుగుతున్నాయని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అని ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని వారన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కౌన్సిలర్లు కొమ్మన నాగలక్ష్మి, దేశిడి శేఖర్ రెడ్డి,గంధం రామకృష్ణ,మాజీ కౌన్సిలర్ పాతూరి ప్రసాద్,ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీను, కాంగ్రెస్ నాయకులు పాతూరి శరత్, అంబటి వెంకటకృష్ణ, కోడి రెక్క ఇంద్ర కుమార్, అజ్జు రామారావు, పరమేశ్, పర్వేజ్ ఖాన్,శేఖర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు