మల్దకల్ జనవరి 27(జనంసాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ శుక్రవారం గద్వాల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గద్వాల్ ఆస్థాన కవి పోకూరి కాశీపతి 130 జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం కవిసమ్మేళనం నిర్వహించారు.మల్దకల్ గ్రామానికి చెందినకవి సుంకరి బసవరాజప్పతన కవిత పఠణం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్,పోకూరి కాశీపతి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.గద్వాల ఆస్థాన కవి సింహం చాలా గొప్పవారని గద్వాల ఆస్థానంలో గొప్ప సన్మానాలు పొందినారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్రీపతి నాయుడు హరినాగభూషణం నాయ్యవాది,వినోదాచారి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ చారి,కవులుపవన్,కుమార్,రామ్మోహనరావు,డా,బాలస్వామి,చంద్రప్రకాష్ రావు,కాశీపతి మనవడు పోకూరి చెన్నకేశవ,నిర్వాహకులు రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.




