Wednesday, 4 November 2026

కుటుంబ పోషణకు భారంగా మారిన సి ఆర్ టి లు * ఐదు నెలలగా రాని సిఆర్టిల జీతాలు

 

 

 

 

* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్టేకులపల్లి, జనవరి 27( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి నేటికీ జీతాలు లేక పోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని, వారు బతకడం ఎలాగని,సిఆర్టి లు ఆవేదన చెందుతున్నారని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. కోయగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారంజరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో సిఆర్టిలకు కుటుంబ పోషణ భారంగా మారిందని,వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని,కుటుంబ సభ్యుల యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో చెల్లించనటువంటి ఒక నెల జీతాన్ని చెల్లించాలని,పిఆర్సి ప్రకారం పెరిగిన జీతాల ఏరియర్స్ను చెల్లించాలని, సిఆర్టి లను రెగ్యులర్ చేసి ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని,ఐటీడీఏ భద్రాచలం పరిధిలో తొలిగించబడిన సిఆర్టిలందరినీ విధులలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతులు,బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని,గిరిజన ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ ఈ.ముత్తయ్య,మండల కార్యదర్శి ఎం.శారద, ఉపాధ్యాయులు బి.కస్నా నాయక్,సిహెచ్.జానకి,జి.బిచ్చ తదితరులు పాల్గొన్నారు.