కాస్త ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: ఎం.ఎస్
హైదరాబాద్: కాస్త ఆలస్యమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరాబు వ్యాఖ్యానించారు. సీనియర్లంతా అధిష్ఠానంతో మాట్లాడామని… దీనిపై అధినాయకత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. ఆది నుంచి లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన్ను నిందించాల్సిన అవసరం లేదన్నారు.