Tuesday, 3 November 2026

కింగ్‌ ఫిషర్‌ మరింత పటిష్ఠమైన ప్రణాళికతో రావాలి: అజిత్‌సింగ్‌

ఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ సంస్థ మరింత పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రైవెటు సంస్థ కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని మంత్రి అన్నారు. సబ్బంది జీతాలు, పన్ను బకాయిల చెల్లింపు విషయాల్లో కింగ్‌ఫిషర్‌ మరింత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు రావాలని అభిలషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిబ్బందికి ఏడు నెలల జీతం బాకీ ఉన్న కింగ్‌ఫిషర్‌ దీపావళి లోపల మూడు నెలల జీతం చెల్లిస్తామన్న ప్రతిపాదన తేవడం, దాన్ని సిబ్బంది వ్యతిరేకించడం తెలిసిందే, ఈ విషయంపై మంత్రి పై విధంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *