హైదరాబాద్,: జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న కిడ్నాపైన రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాకేష్‌రెడ్డిని కత్తులతో పొడిచి దుండగులు కిరాతకంగా చంపారు. రాకేష్ ను విడిచిపెట్టడానికి దుండగులు కుటుంబ సభ్యులను రూ.8 లక్షలు డిమాండ్ చేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.




