హైదారాబాద్: ఆజాద్, షిండే ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రదర్శించిందని భాజపా సీనియర్ నేత దతాత్రేయ విమర్శించారు.ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ బొత్స సత్యనారాయణ తెలంగాణకు అడ్డుపడుతున్నారని దతాత్రేయ ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ సమస్య పరిష్కరించకుండా రాష్ట్రాన్ని గందరగోళ సమస్య పరిష్కరిస్తామన్న కేంద్ర హోంమంత్రి షిండే మాట తప్పడం విచారకరమన్నారు. సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధి లేనప్పుడు ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.




