Monday, 2 November 2026

కివి పబ్లిక్ స్కూల్లో సైన్స్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జిబిషన్కివి పబ్లిక్ స్కూల్లో సైన్స్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జిబిషన్

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 28 (జనం సాక్షి)సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని కివి పబ్లిక్ స్కూల్ ఎస్.ఆర్ తోట కరీమాబాద్ వరంగల్ నందు ఉమంగ్ పేరుతో సైన్స్ మరియు లాంగ్వేజ్ ఎగ్జిబిషన్ పాఠశాల మైదానంలో మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పోరేటర్ పల్లం పద్మ రవి దంపతులు హాజరై విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా తిలకించారు, విద్యార్థులలో దాగివున్న సైన్స్ ప్రతిభను వెలికి తీయడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు భవిష్యత్తులో ఎన్నో ఆవిష్కరణలు చేసి దేశానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. రోబోటిక్ హ్యాండ్ ,ఘోస్ట్ హౌస్ ,వరదలకు తట్టుకునే ఇల్లు ,ఆర్గానిక్ సోప్స్ తయారీ ,మై హెరిటేజ్ సిటీ వరంగల్ సేఫ్టీ అలారం, తదితర ఎగ్జిబిట్స్ బాగా ఆకట్టుకున్నవి ఈ సందర్భంగా వివిధ వినూతమైన ప్రయోగాలు చేసిన విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసి సతీష్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, అధ్యాపక బృందం దివ్య ,స్వాతి, మంజుల ,రవితేజ ,చిన్న ,రంజిత శాంతకుమారి ,సరిత ,రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.