బిచ్కుంద ఫిబ్రవరి 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్యే అరుణ తార అధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జిల్లా భాజాపా అధ్యక్షురాలు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తార స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పక్కా ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటి అనేక రకాల హామీలను చేసి మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పార్టీ తమ కుటుంబమే అభివృద్ధి అయ్యే విధంగా చేస్తోందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో భాజాపాను బలోపేతం చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ పంతులు, మల్లికార్జున్ దేశయ్, జాదవ్ పండరి, పత్తి రమేష్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భాజాపాలో భారీ సంఖ్యలో చేరికలు




