Saturday, 7 November 2026

కిసాన్ చౌక్ ను ఏర్పాటు చేసిన రైతులు.

కిసాన్ చౌక్ ను ఏర్పాటు చేసిన రైతులు…

భైంసా రూరల్ డిసెంబర్ 23 జనం సాక్షి

నేడు జాతీయరైతు దినోత్సవన్ని పురస్కరించుకొని బైంసా లోని బోకర్ చెక్పోస్ట్ ని కిసాన్ చౌక్ గా పట్టణబట్టిగల్లీ వాసులు ఏర్పాటుచేశారు. కిసాన్ యొక్క ఫ్లెక్సీని పెట్టి,పూజ కార్యక్రమలు నిర్వహించారు.అనంతరం జై కిసాన్ జై జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు మల్లేష్ మరియు మాజీ అధ్యక్షులు రావుల పోశెట్టి సభ్యులు రాజేశ్వర్ మరియు గల్లీ పెద్దలు రవీందర్ సార్,నారాయణ,భూమన్న, కోర్వగల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శంకర్, మాజీ అధ్యక్షులు నరసయ్య, సభ్యులు నాగనాథ్,భూమన్న కాలోని సంఘం సభ్యులు అనిల్ పాల్గొనడం జరిగింది.