Saturday, 7 November 2026

నీల్వాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసీపీ

నీల్వాయి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసీపీ

వేమనపల్లి,డిసెంబర్ 23,(జనంసాక్షి):

నీల్వాయి పోలీస్‌స్టేషన్‌ ను శుక్రవారం జైపూర్ ఏసీపీ గోపతి నరేందర్ ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ పద్మారెడ్డి ని ఆదేశించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.కమ్యునిటీ పోలిసింగ్‌లో భాగంగా గ్రామాలలో సీసీ కెమెరాల గురించి  ప్రజలకు అవగాహన కల్పించి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు.ప్రజా పిర్యాదులో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని,నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం  చేసుకోవాలన్నారు.సీసీఎన్‌టీఎస్‌ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు డేటాను నమోదు చేయాలని, ఈపెట్టి కేసులు,చాలన్స్‌ కేసులలో ఫెసియెల్‌, ఫింగర్‌ ప్రింట్స్‌లలో అవసరమని,వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.సిబ్బంది క్రమశిక్షణ,సమయ పాలన,నిబద్దత కలిగి ఉండాలన్నారు.బాధితులపై మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సిఐ విద్యాసాగర్,ఎస్సై గోపతి నరేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.