కుంటాల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత…
– రోడ్డుపై బైఠాయించి నినాదాలు.
జనం సాక్షి భైంసా రూరల్
– నవంబర్ 28
స్టేషన్ను బద్దలు కొట్టి అభిమాన నాయకుని బయటకు తీసుకు వచ్చిన కార్యకర్తలు.
బిజెపి చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర బైంసా నుండి ప్రారంభం కానుండగా ఆదివారం రాత్రి సమయం లో పాదయాత్రకి,సభకి అనుమతులు లేవు అంటూ తెలపడంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భాజపా నాయకులు మోహన్ రావు పటేల్ ని పోలీసులు అక్రమ అరెస్టు చేసి కుంటాల పోలీస్ స్టేషన్ కు తరలించగా, సోమవారం అక్రమ అరెస్టులను నిలిపివేయాలంటూ,మోహన్ రావు పటేల్ ను రిలీజ్ చేయాలని పెద్ద మొత్తంలో కుంటాల పోలీస్ స్టేషన్ కు మోహన్ రావు అభిమాన కార్యవర్గం తరలి వెళ్లి ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకువెళ్లి,స్టేషన్ బద్దలు కొట్టి తమ నేతని బయటికి తీసుకుని వచ్చారు. రోడ్డుపై బైఠాయించి అక్రమ అరెస్టులు సరికాద0టు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.




