భైంసా రూరల్ జనవరి 28 జనం సాక్షి
చేతికొచ్చినపంట..!తీరానీరు లేక నేలపాలు అయితే ఎలా..? కరెంటులేక పంటలకు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి…- సబ్ స్టేషన్ ను ముట్టడించిన వైనం…నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని రైతులు శనివారం కరెంటు సబ్స్టేషన్ ముట్టడించారు. కరెంటు లేక పంట పొలాలకు నీరు పెట్టలేని పరిస్థితి వచ్చిందంటూ, వేలపాలలేని కరెంటు వల్ల ఇబ్బంది ఎదురుకోవాల్సిన పరిస్థితిఅని,చేతి కి వచ్చిన పంట చివరకు నీరు లేక నేలపాలయ్యేలా..! ఉన్నాదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుంటాల సబ్స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి కరెంట్ ఇవ్వాలంటూనినాదాలు చేశారు. 24 గంటలు కరెంటు అని చెప్పి తీరా చూస్తే ఇప్పుడు కనీసం పంట పొలాలకు నీరు అందించే టైం వరకు కూడా కరెంటు ఉండలేదంటూ వాపోతూన్నారు. రైతులకు పలువురు నాయకులు సైతం మద్దతు తెలిపారు. స్పందించిన అధికారులు తొందరలోనే పై అధికారులతో మాట్లాడి సమస్యను చక్కదిద్దేలా చూస్తామని తెలిపారు.




