Tuesday, 3 November 2026

కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు..

చేర్యాల (జనంసాక్షి) జూన్ 24 : కుక్క కాటుకు గురై ఓ మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గర్నపల్లి మల్లవ్వ పై తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుక్క కాటుకు మందులు దొరకక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ అనేక సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరగడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన చేశారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.