కుటుంబానికి పరిహారం కోసం ఆందోళన…………………………….

శ్రీరాంపూర్ సింగరేణి ఓసిపిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అట్కపురం రాజయ్య కుటుంబానికి 30 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఓసిపిలో ఆందోళన చేపట్టారు. సిఆర్ఆర్ సంస్థకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే మృతి చెందిన రాజయ్య కు ఇన్స్యూరెన్స్ వచ్చి ఉండదని అన్నారు. కార్మికుడు మృతి పై సింగరేణి డైరెక్టర్ బలరాం దృష్టికి రఘునాథ్ తీసుకువెళ్ళి నష్ట పరిహారం త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి రఘునాథ్ తక్షణ సహాయం క్రింద 10 వేల రూపాయలు అందజేయడం జరిగింది.