కలెక్టర్ కు జనసమితి వినతి…………………
మంచిర్యాల జిల్లా పాలనాధికారి కి తెలంగాణ జన సమితి పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు…ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జుమ్మిడి గోపాల్ మాట్లాడుతూ కోర్టు వివాదాల్లో ఉన్న నస్పూర్ సర్వేనెంబర్ 42 యందు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పనులను వెంటనే నిలిపివేసి తొలగించాలని అన్నారు ఇట్టి విషయం పై నస్పూర్ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, అగ్గిమాపక శాఖకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది అన్నారు దాని పై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు నస్పూర్ మున్సిపల్ కమిషనర్ కాసులకు కక్కుర్తి పడి అక్రమాలకు పాల్పడుతూ ఎగ్జిబిషన్ కు వత్తాసు పలుకుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడగక సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కావున ఎగ్జిబిషన్ కు కొమ్ముకాస్తూ కాసులకు కక్కుర్తి పడి అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల పై చర్యలు తీసుకొని తక్షణమే ఎగ్జిబిషన్ ను నిలిపివేసి తొలగించాలని డిమాండ్ చేశారు… లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.