Wednesday, 4 November 2026

కుటుంబ కలహాలతో భార్యా ఆత్మహత్య.

 

 

 

 

 

 

 

 

 

– భర్త ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకొని ఆత్మహత్య యత్న0..- భర్త పరిస్థితి విషమం.- ఆస్పత్రికి తరలించిన వైనం.భైంసా రూరల్ ఫిబ్రవరి 12 జనం సాక్షిభైంసా పట్టణ కేంద్రంలో ఆదివారం ఓ కుటుంబంలో కలహాలుతీరని విషాదాన్ని నింపాయి. పట్టణంలోని నర్సింహనగర్ కు చెందిన ఈరేవార్ దీపా (22) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకోగా.. భర్త సాయి ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని ఆత్మహత్య యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయికి గత ఏడాది దీపాతో వివాహాం జరిగింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గోడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా ఇంట్లో గోడవలు జరుగగా.. క్షణాకావేశానికి లోనైన దీపా ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందని మనస్థాపం చెందిన సాయి కుభీర్ క్రాస్ రోడ్డులో గల ట్రాన్స్ ఫార్మర్ కు ముట్టుకొని తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. దీపా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.