Wednesday, 4 November 2026

దరఖాస్తుల ఆహ్వానం

 

 

 

 

 

 

జుక్కల్, పిబ్రవరి 12, (జనం సాక్షి),సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన వెలువడిందని ప్రిన్సిపాల్ టి.నళిని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్నవిద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపారు.మార్చి 6వ తేదీలోగా 100 రూపాయల ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే గురుకుల పాఠశాలలో 6 ,7, 8 ,9వ తరగతులలో ఖాళీ సీట్ల బ్యాక్ లాగ్ భర్తీకి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. బ్యాక్ లాగ్ ఖాళీ సీట్లకు మార్చి 7 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదవ తరగతి అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ లో జరుగుతుందని తెలిపారు. 6, 7 ,8, 9వ తరగతి తరగతులకు బ్యాక్ లాగ్ సీట్లలో అభ్యర్థులకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు వెబ్ సైట్ www.tswreis.ac.in nu సందర్శించాలని తెలిపారు.